జవాన్ 2 గురించి హింట్ ఇచ్చిన హీరోయిన్!
on Sep 13, 2023
జవాన్2 సినిమా గురించి హింట్ ఇచ్చేశారు హీరోయిన్ సాన్యా మల్హోత్రా. ఇప్పటిదాకా అందరూ ఓ సౌత్ డైరక్టర్ వెళ్లి నార్త్ లో అడుగుపెట్టడం, అక్కడ నిలదొక్కుకోవడం, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి సంస్థ, అందరూ సౌత్ వాళ్లను ప్రోత్సహిస్తూ సినిమా చేయడం, మాసివ్ హిట్ కావడం, వెయ్యి కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేయడం... ఇంతవరకే మాట్లాడుకుంటున్నాం. అయితే హిట్ సినిమా ప్రతి దానిలోనూ తొంగిచూసే సీక్వెల్ న్యూస్, జవాన్‌లో ఇప్పటిదాకా రాలేదు. అయితే ఇప్పుడు ఆ ఘడియలు రానే వచ్చేశాయి. హీరోయిన్ సాన్యా మల్హోత్రా జవాన్ మూవీకి సీక్వెల్ గురించి మాట్లాడారు.
జవాన్‌లో షారుఖ్‌తో ఉండే అమ్మాయిల్లో సాన్యా మల్హోత్రా కూడా ఒకరు. ``జవాన్ సీక్వెల్ గురించి నన్ను ఒకరిద్దరు అడుగుతున్నారు. పార్ట్ 2 గురించి అడుగుతున్నారంటేనే, సినిమా ఎంత పెద్ద సక్సెసో అర్థం చేసుకోవచ్చు. నేను కూడా ఆడియన్స్ గా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బావుంటుందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఎక్స్ టెండెడ్ వెర్షన్ ఉండాలని ఆశిస్తున్నాను. జవాన్2 సినిమా రావాలని, అందులో నన్ను కూడా నటిగా తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇప్పటిదాకా మా టీమ్‌లో అలాంటి చర్చలైతే జరగలేదు. కానీ తప్పకుండా సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుందన్నది నా అభిప్రాయం`` అని అన్నారు. అట్లీ దర్శకత్వం వహించిన సినిమా జవాన్. గౌరీ ఖాన్ నిర్మించారు. గౌరవ్ వర్మ సహ నిర్మాత. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు. వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని నమ్ముతున్నారు నిర్మాతలు. అదే జరిగితే ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా షారుఖ్ పేరు హిస్టరీలో ఉండిపోతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
